వేదంలా ఘోశించే గోదావరి (ఆంధ్ర కేసరి)





వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి
వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి

రాజరాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు, నరపతలు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించే గౌతమి హోరు

వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి

శ్రీవాణి గిరిజాశ్చిరాయదదతో వక్షో ముఖాంవేషు
ఏ లోకానాం స్థితి మావహంచ విహితామ్ స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రీపురుషా సంపూజితా
వసుర్భోయాసుహు పురుషోత్తమాం భుజభవ శ్రీకందారాశ్రేయసే

ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాథకవి నివాసము పెద్ద ముచ్చట
ఆది కవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాథకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిదె ఆలవాలము
కవి సార్వభౌములకిదె ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము

వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టు కథల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టు కథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపొయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

వేదంలా ఘోశించే గోదావరి
అమర ధామంలా శోభిల్లె రాజమహేంద్రి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...