ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో (నేనున్నాను )

 వేణు మాధవా ఆ ఆ , వేణు మాధవా  ఆ ఆ  ఆ 


ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమె మంత్రమౌతున్నదో 

ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై

నిను చేరని మాధవా ఆ ఆ ఆ ఆ ఆ 


ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో


మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ

వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువును నిలువున తొలిచిన గాయములే 

తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా  

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగ మారింది

ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది

వేణు మాధవ నీ సన్నిధీ      


ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

ఏ మోవిపై వాలితే మౌనమె మంత్రమౌతున్నదో 


చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ

నలు వైపుల నడి రాతిరి ఎదురవదా 

అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికి

అలజడితో అణువణువు తడబడదా 

ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది

నివాళిగా నా మది నివేదించు నిమిషమిది 

వేణు మాధవ నీ సన్నిధీ 



గ గ రి గ రి స రి గ గ రి రి స రి

గ ప ద సా స ద ప గ రి స రి

గ ప ద ప ద గ ప ద స ద

ద ప గ రి గా

గ ప ద స స గ ప ద స స

ద ప ద రి రి ద ప ద రి రి

ద స రి గ రి స రి

గ రి స రి గ రి గరిసరిగా

రి స ద ప గ గ గ పా పా

ద ప ద ద ద గ స ద స స

గ ప ద స రి స రి స రి స ద స రి

గ ద స ప గ రి ప ద ప ద స రి

స రి గ ప ద రి

స గ ప ద ప స గ స

ప ద ప స గ స

ప ద ప రి స రి ప ద ప రి స రి

ప ద స రి గ రి స గ ప

ద స స గ స రి స గ

స రి గ ప ద స రి గా


రాధికా హృదయ రాగాంజలి

నీ పాదముల వ్రాలు కుసుమాంజలి

ఈ గీతాంజలి    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...