మాతృదేవోభవ

పదకర్త - వేటూరి సుందరరామమూర్తి

స్వరకర్త - మరకతమణి కీరవాణి

గానం - కె.ఎస్.చిత్ర 

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి 

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి 

మమతలన్ని మౌన గానం, వాంఛలన్ని వాయులీనం  

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి 

మాతృదేవోభవ..మాతృదేవోభవ  

పితృదేవోభవ..పితృదేవోభవ

ఆచార్యదేవోభవ..ఆచార్యదేవోభవ    

ఏడు కొండలకైనా బండ తానొక్కటె, ఏడు జన్మల తీపి ఈ బంధమే

ఏడు కొండలకైనా బండ తానొక్కటె, ఏడు జన్మల తీపి ఈ బంధమే 

నీ కంటిలొ నలక, లో వెలుగు నే కనక 

నేను మేననుకుంటె ఎద చీకటీ ..హరీ..హరీ..హరీ..  

రాయినై ఉన్నను ఈనాటికి, రామ పాదము రాక ఏ నటికీ.. 

వేణువై వచ్చాను భువనానికీ, గాలినై పోతాను గగనానికి 

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె,నిప్పు నిప్పుగ మారె నా గుండెలొ  

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయె,నిప్పు నిప్పుగ మారె నా గుండెలొ

ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు, పుట్టిల్లు చేరె  మట్టి ప్రాణాలు  

హరీ..హరీ..హరీ..

రెప్పనై ఉన్నాను మీ కంటికి, పాపనై వస్తాను మీ ఇంటికి..  

వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోయాను గగనానికి  

గాలినై పోయాను గగనానికీ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...