శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
శ్రీ గురుగుహాగ్రజం అగ్ర పూజ్యం (2)
శ్రీ కంఠాత్మజం శృత సామ్రాజ్యం
శ్రీ గణనాథం భజామ్యహం
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వరమణి మయ భూషణం
ఆంజనేయావతారం(2) సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం
శ్రీ గణనాథం భజామ్యహం
తెలవారదేమో స్వామి
చెంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి
నీ తలపుల మునుకలో, అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామీ, తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో, అలసిన దేవేరి అలమేలు మంగకూ
చెలువము నేలగ చెంగట లేవని, కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని, కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి,
అలసిన దేవేరి అలమేలు మంగకూ ,తెలవారదేమో స్వామీ
చెలువము నేలగ చెంగట లేవని, కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై అలసిన దేవేరి,
అలసిన దేవేరి అలమేలు మంగకూ ,తెలవారదేమో స్వామీ
మక్కువ మీరగ అక్కున జేరిచి, అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి, అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ, మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ, తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి ,తెలవారదేమో స్వామి
ఆలోకయె శ్రీబాలకృష్ణం
ఆలోకయె శ్రీబాలకృష్ణం
ఆలోకయె సఖి ఆలోకయె శ్రీబాలకృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం
ఆలోకయె శ్రీబాలకృష్ణం
చరణ నిక్వనిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం
చరణ నిక్వనిత నూపుర కృష్ణం
కర సంగత కనక కంకణ కృష్ణం
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం
మౌక్తిక కృష్ణం
ఆలోకయె సఖి ఆలోకయె శ్రీబాలకృష్ణం
సుందరనాస మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణం
సుందరనాస మౌక్తిక శోభిత కృష్ణం
నంద నందనం అఖండ విభూతి కృష్ణం
కంటోప కంట శోభి కౌస్తుభ కృష్ణం
కంటోప కంట శోభి కౌస్తుభ కృష్ణం
కలి కల్మష తిమిర భాస్కర కృష్ణం
ఆలోకయె సఖి ఆలోకయె శ్రీబాలకృష్ణం
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా జాల కేలన కృష్ణం
గోవత్స బృంద పాలక కృష్ణం
కృత గోపికా జాల కేలన కృష్ణం
నందసునందాది ఆఅ ఆఆఆ
నంద సునందాది ... సునందాది
నందసునందాది సునందాది
సునందాది సునందాది
నందసునందాది వందిత కృష్ణం
శ్రీ నారయణ తీర్థ వరద కృష్ణం
శ్రీ నారయణ తీర్థ వరద కృష్ణం
ఆలోకయె సఖి ఆలోకయె శ్రీబాలకృష్ణం
సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం
తాండవ కృష్ణం తాండవ కృష్ణం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి