సప్తపది





నెమలికి నేర్పిన నడకలివి

నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పలుకులివి
శృంగార సంగీత నృత్యాభినయవేళ
చూడాలి నా నాట్య లీలా

ఆ ఆ ఆ నెమలికి....

కలహంసలకిచ్చిన పదగతులు
యిల కోయిల మెచ్చిన స్వర జతులు
కలహంసలకిచ్చిన పదగతులు
యిల కోయిల మెచ్చిన స్వర జతులు
ఎనెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవొ కన్నుల కిన్నెరలు
ఎనెన్నో వన్నెల వెన్నెలలు
ఏవేవొ కన్నుల కిన్నెరలు
కలిసి మెలిసి కలలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పనావల్పశిల్పమణి
నీ కలను.. శకుంతలను

ఆ ఆ ఆ ఆ నెమలికి....

చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లొ తారకలు
తారాడె చూపుల్లొ చంద్రికలు
నీలాల కన్నుల్లొ తారకలు
తారాడె చూపుల్లొ చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవివర్మ చిత్రలేఖనాలేఖ సరస సౌందర్య రేఖను
శశిరేఖను

ఆ ఆ ఆ నెమలికి...

మరుగేలరా ఓ రాఘవా

మరుగేలరా ఓ రాఘవా; మరుగేలరా ఓ రాఘవా; మరుగేలరా ఓ రాఘవా
మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన (2)
మరుగేలరా ఓ రాఘవా

అన్ని నీవనుచు అంతరంగమునా
అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్య (2)
నిన్నే గాని మదినెన్నజాల నొరుల (2) నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత....
మరుగేలర ఓ రాఘవా (2)  ఆఅ..ఆఅ...ఆఆ

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి 

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ ఆ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ మోహన మురళీ
ఇదేనా ఆ మురళీ

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ మోహన మురళీ
ఇదేనా ఆ మురళీ

కాళింది మడుగున కాళీయుని పడగలా
ఆబాల గొపాల మా బాలగొపాలుని
కాళింది మడుగున కాళీయుని పడగలా
ఆబాల గొపాల మా బాలగొపాలుని
ఆ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులచూడ
ఆ చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులచూడ
తాండవమాడిన సరళీ గుండెలనూదిన మురళీ
ఇదేనా ఇదేనా ఆ మురళీ

అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులె కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులె కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళీ

ఆ ఆ ఆ  వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళీ
ఇదేనా ఆ మురళీ

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ ఆ ఆ ఆ ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా ఆ మురళీ

రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళీ ఆ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ మోహన మురళీ
ఇదేనా ఆ మురళీ

అఖిలాండేశ్వరి చాముండేశ్వరి

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్
ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం

తామ్ తకఝమ్ తరిత
తతికిటతోమ్ తకతరి ఝమ్ తరిత
తతికిటతోమ్ తామ్తకఝమ్ తకఝరితోమ్ తజ్జమ్
తదికిటతోమ్ తదికిటతొమ్ తదికిటతోమ్

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ
అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

తామ్ తద్దీమ్ తద్దీమ్
తకదిమి తకఝను తకదిమి తకఝను
తామ్ తద్దీమ్ తద్దీమ్
తకదిమి తకఝను తకదిమి తకఝను
తామ్ దీమ్ తొమ్ నమ్ తరిగిడతొమ్ తరిగిడతొమ్ తరిగిడతొమ్

శుభగాత్రి గిరిరాజ పుత్రీ అభినేత్రి శర్వార్ధ గాత్రీ
ఆ ఆ... శుభగాత్రి గిరిరాజ పుత్రీ అభినేత్రి శర్వార్ధ గాత్రీ
శర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళ కీర్తీ
శర్వార్ధ సందాత్రి జగడెక జనయిత్రి చంద్రప్రభా ధవళ కీర్తీ

చతుర్భాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాలిని
కుంకుమ రాగ శోభిని కుసుమ బాణ సంశోభిని
మౌన సుహాసిని గాన వినోదిని భగవతీ పార్వతీ దేవీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

తదీమ్ త త ఝమ్ తకజమ్ తకజమ్
తరిగిడతోమ్ తరిగిడతోమ్
తధీమ్ త త ఝమ్ తకజమ్ తకజమ్
తరిగిడతోమ్ తరిగిడతోమ్
తకదీమ్ త తకదీమ్ త
తక తదీమ్ తమ్ త తకదిమి తజ్జను తామ్

శ్రీహరి ప్రణయాంబురాశీ శ్రీపాద విచలిత క్షీరాంబురాశీ
శ్రీహరి ప్రణయాంబురాశీ శ్రీపాద విచలిత క్షీరాంబురాశీ
శ్రీపీఠ సంవర్దినీం డోలాసుర మర్ధినీమ్
శ్రీపీఠ సంవర్దినీం డోలాసుర మర్ధినీమ్

ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ
ధనలక్ష్మీ ధాన్యలక్ష్మీ ధైర్యలక్ష్మీ విజయలక్ష్మీ
ఆదిలక్ష్మీ విద్యాలక్ష్మీ గజలక్ష్మీ సంతానలక్ష్మీ
సకల భోగగ సౌభాగ్యలక్ష్మీ శ్రీమహాలక్ష్మి దేవి

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

తకదిమి తకఝను తకదిమి తకఝను తామ్
తకదిమి తకఝను తకదిమి తకఝను తొమ్

ఇందు వదనే కుందరదనే వీణా పుస్తక ధారిణె
ఇందు వదనే కుందరదనే వీణా పుస్తక ధారిణె
శుక శౌణకాది వ్యాస వాల్మీకి మునిజన పోషిత శుభ చరణె
శుక శౌణకాది వ్యాస వాల్మీకి మునిజన పోషిత శుభ చరణె
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళె
సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళె
వరదే అక్షర రూపిణి శారదే దేవీ

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

వింధ్యాటవీవాసినే యోగ సంజ్ఙా సముద్భాషినే
సింహాసన స్థాయినే దుష్టహరంహక్రియ నాశినే
విష్ణుప్రియే సర్వలోక ప్రియే సర్వనామప్రియే ధర్మ సమర ప్రియే
హే బ్రహ్మచారిణే దుష్కర్మవారినే హే విలంబిత కేశపాశినే
మహిశ మర్దనశీల మహిత గర్జనలోల భయద నర్తన కేళికే కాళికే
దుర్గమాందుర్గ వాహినే దుర్గే దేవీమ్

అఖిలాండేశ్వరీ చాముండేశ్వరీ పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎఱ్ఱన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎఱ్ఱన ఎందువలన
గోధూళి ఎఱ్ఱన ఎందువలన

తెల్లావు కడుపులో కఱ్ఱావులుండవా .. ఎందుకుండవ్?
కఱ్ఱావు కడుపున ఎఱ్ఱావు పుట్టదా ..ఏమో?
తెల్లావు కడుపులో కఱ్ఱావులుండవా?
కఱ్ఱావు కడుపున ఎఱ్ఱావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా
గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా
ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా

ఎందువలన అంటే అందువలన
ఎందువలనా అంటే దైవఘటన

పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు... అయ్యో పాపం
అల్లనమోవికి తాకితే గేయాలు ... ఆ ఆ ఆ ఆ
పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ మురళి మోగేనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా

జాతవేదసే (దుర్గా సూక్తం )

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతియతో నిదహాతి వేద:
స న: పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితా త్యగ్ని:

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనిం కర్మఫలేషు జుష్టామ్:
దుర్గామ్ దేవీ గ్ మ్ శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ:

అగ్నేత్వం పారయా నవ్యో అస్మాన్థ్ స్వస్తిభిరితి దుర్గాణి విశ్వా
పుశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయో:

విశ్వాని నో దుర్గహ జాతవేద:సింధున్న నావ దురితాతి పర్-షి
అగ్నే అత్రివన్మనసా గృణానో స్మాకం బొధ్యవితా తనూనామ్

పృతనా జిత్ గ్ ం  సహ మనముగ్రమగ్ని గ్ మ్ హువేమ పరమాథ్ సధస్థా త్
స న: పర్-షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతి దురితా త్యగ్ని:

ప్రత్నోషి కమిడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్య శ్చ సత్సి
స్వాఞ్చాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభాగమాయ జస్వ

గో భిర్జుష్ట మయుజోనిషిక్తం తవేంద్ర విష్ణోరనుసఞ్చరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మా దయన్తామ్

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నొ దుర్గి: ప్రచోదయాత్

ఓం శాంతి: శాంతి: శాంతి:


భామనే సత్యా భామనే సత్యా భామనే
భామనే సత్యా భామనే సత్యా భామనే  సత్యా భామనే
సత్యా భామనే సత్యా భామనే
వయ్యారి ముద్దులా  వయ్యారి ముద్దుల  సత్యా భామనే సత్యా భామనే

భామనే పది ఆరువేల కోమలులందరిలోన
భామనే పది ఆరువేల కోమలులందరిలో లలన చెలియ మగువా సఖియా
రామరో గోపాల దేవుని ప్రేమను దోచినా దాన
రామరో గోపాల దేవుని ప్రేమను దోచిన సత్యా భామనే సత్యా భామనే

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే
జాణ తనమున సతులలో జాణ తనమున సతులలో నెరజాణనై
నెరజాణనై నెరజాణనై వెలిగేటి దాన భామనే  సత్యా భామనే
సత్యా భామనే సత్యా భామనే

అయి గిరి నందిని

అయి గిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య  శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే
భగవతి హేశితి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

అయి జగదంబ మదంభ కదంబ వనప్రియ వాస విలాసిని హాసరతే
శిఖిరి శిరోమని తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే
మధుమధురేమధు కైటభ భంజని కైటభ గంజని నిరాసరతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

జన జన జనచనుహ్రీంకృతనుంకుర సింజితమోహితనూతపతే
నటిత నటార్థ నటీనట నాయక నాటిత నాటక నాట్యరతే
పదనకపాళిని ఫాల విలోచని పద్మ విలాసిని విశ్వదురే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

కళ మురళీరవ వాదిట పూజిత కోకిల మంజుల మంజురతే
మిలిత మిళింద మనోహర గుంభిత సంజిత శైల నిగుంజగతే
మృగఘన భూత మహాశబరీ ఘనరింఘన సంబృత కేళిహ్రుతే
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

రమ్యకపర్ధిని శైలసుతే
రమ్యకపర్ధిని శైలసుతే
రమ్యకపర్ధిని శైలసుతే

ఏ కులము నీదంటే

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఆ ఆ ఆ ఆ
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఆది నుండి ఆకాశం మూగది అనాదిగ తల్లి ధరణి మూగది
ఆది నుండి ఆకాశం మూగది అనాదిగ తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు

ఆ ఆ ఆ ఆ
ఏ కులమునీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...