రామ చక్కని సీతకి అరచేత గోరింట
నీల గగన ఘనవి చలన ధరణీజ శ్రీరమణ ఆ ఆ ఆ
మధుర వదనా నళిన నయనా మనవి వినరా రామ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకి
ఎఱ్ఱజాబిలి చేయిగిల్లి రాముడెడని అడుగుతుంటె
చూడలేదని పెదవి చెప్పె చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురముడే
రామ చక్కని సీతకి
చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోనె నీటి తెరెలె అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపె మనసు మాటలు కాదుగా
రామ చక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకి
ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంతమదన ప్రేమా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి భేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపుగా పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొఱకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి