ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలె పూసిన పొదరిల్లు
అందమైన ఆ లోకం అందుకోనా
ఆదమరిచి కలకాలం ఉండిపొనా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలె పూసిన పొదరిల్లు
మబ్బుల్లొ తూలుతున్న మెరుపైపోనా
వయారి వాన ఝల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లొ రంగులెన్నొ చిలికేనా
పిల్లగాలి పల్లకీగా దిక్కులన్ని చుట్టిరానా
నా కొసం నవరాగాలే నాట్యమాడెనుగ
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలె పూసిన పొదరిల్లు
అందమైన ఆ లొకం అందుకొనా
ఆదమరిచి కలకాలం ఉండిపొనా
స్వర్గాల స్వాగతాలు తెలిపె గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చె తారలెన్నొ మెరిసె తీరం
ముత్యాల తొరణాల ముఖద్వారం
శొభలేలె సొయగానా చందమామా మందిరానా
నా కొసం సుర భొగాలె వేచి నిలిచెనుగా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలె పూసిన పొదరిల్లు
అందమైన ఆ లొకం అందుకొనా
ఆదమరిచి కలకాలం ఉండిపొనా
ఆకాశంలో ఆశల హరివిల్లు
ఆనందాలె పూసిన పొదరిల్లు
చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు
చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివెడ చల్లెడు లక్షణుడు
సొలసి చూచినను సూర్య చంద్రులను
లలివెడ చల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గనివొ ఇతడు
కలిగించు సురల గనివొ ఇతడు
చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరి యశోదకు శిశువితడు
కొలువై ఉన్నాడే
కంటినాలంబయేత్ గీతం
హస్తిన అర్దం ప్రదర్శనయేత్
చక్షుభ్యామ్ దర్శనయేత్ భావం
పాదాభ్యామ్ తాళం ఆరయేత్
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
వలరాజు పగవాడె వనిత మొహనాంగుడె
వలరాజు పగవాడె వనిత మొహనాంగుడె
కొలువై ఉన్నాడే
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరుచులవంక కనర
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరుచులవంక కనర
పలుపొంకమగు చిలువలకంకణములమర
నలువంకల మణిరుచులవంక కనర
తలవంక నలవేలు ఉ ఉ ఉ
ఆఆ
తలవంక నలవేలు
కులవంక నెలవంక
తలవంక నలవేలు
కులవంక నెలవంక
వలచేత నొసగింక వైఖరి మీరంగ
కొలువై ఉన్నాడే దేవ దేవుడు
కొలువై ఉన్నాడే ఏ
మేలుగ రతనంబు రాలు చెక్కిన ఉంగరాలు
భుజగ కేయురాలు మెరయంగ
మేలుగ రతనంబు రాలు చెక్కిన వుంగరాలు
భుజగ కేయురాలు మెరయంగ
పాలుగారు మొమున శ్రీలు పొదమ
పాలుగారు మొమున శ్రీలు పొదమ
పులి తోలు గట్టి ఉమ్మొన వాలు బట్టి చెలగ || కొలువై ||
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనె చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లనె చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొన్గు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరుగని వేగంతో వెళ్ళు
లయకే నిలయమై నీపాదం సాగాలి
మలయానిలగతిలో సుమ బాలగ తూగాలి
వలలో ఒదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి
తిరిగే కాలానికీ ఆఆఅ ఆఆఅ...
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటి లోకి చేరకుంటె
విరుచుకుపడు సురగంగకు విలువేముంది
విలువేముందీ
దూకె అలలకూ ఏ తాళం వేస్తారు ఆ హ హ
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్థం
వద్దని ఆపలేరు ఆ ఆ ఆ ఆ..
వద్దని ఆపలేరు ఉరికె ఊహని
హద్దులు దాటరాడు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె
విరి వనముల పరిమళముల విలువేముంది
విలువేముంది
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొన్గు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లనె చల్లని చిరు జల్లు
పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు
శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ సిరిసిరి మువ్వ
శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ
సిరిసిరి మువ్వ
మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా
సిరిసిరి మువ్వ
యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వ
సిరిసిరి మువ్వ
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరి మువ్వ
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగడు త్రోవ
యెదిరించిన సుడిగాలిని జయించి నావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావా
పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకి వై
తూరుపు వేదికపై వేకువ నర్తకి వై
ధాత్రిని మురిపించే కాంతులు చిందని......
నీకదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ.... శివపూజకు
తన వేళ్ళె సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆమని కై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అవది లేని అందముంది అవనికి నలు దిక్కులా అ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రతి రోజొక నవదీపిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా
" పరుగాపక"
చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషొదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషొదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయం లో వికసిత శతదళ శోభిత సువర్ణకమలం
స్వ ధర్మే నిధనమ్ శ్రేయ: పర ధర్మొ భయవహహ
కొత్తగా రెక్కలొచ్చెనా
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటునున్న కన్నెమల్లికి
కొమ్మచాటునున్న కన్నెమల్లికి ||కొత్తగా||
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నెర్చింది కలికియేటి నీరు
ఆహ హ హ హ హ హ హ హ ఆఆ
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నేర్చింది కలికియేటి నీరు
బండరాల హోరుమారి పంటచే ల పాటలూరి
బండరాల హోరుమారి పంట చేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగెలా
సిరిచిందు లేసింది కనువిందు చేసింది ||కొత్తగా||
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధుర గానకేళి
ఆహ అహహహ హహహహ ఆఆ
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలొని
అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలొని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నొ చూపింది కలలెన్నొ రేపింది
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటునున్న కన్నెమల్లికి
కొమ్మచాటునున్న కన్నెమల్లికి
అందెల రవమిది
గురుర్బ్రహ్మా ఆ ఆ
గురుర్విష్ణు: ఆ ఆ
గురుర్దేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ
గురుసాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవేనమ:
ఓం నమో నమో నమ:శివాయ
మంగళ ప్రదాయ గొపురంగతే నమ:శివాయ
గంగయాత రంగితొత్త మాంగినే నమ:శివాయ
ఓం నమో నమో నమ:శివాయ
శూలినే నమో నమ: కపాలినే నమ:శివాయ
పాలినే విరంచి తుండ మాలినే నమ:శివాయ
అందెల రవమిది పదములదా ఆ ఆ ఆ
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
ఆంగిక సాధన సార్థకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
ఆంగిక సాధన సార్థకమందగ యోగ బలముగ యాగ ఫలముగ
బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా
అందెల రవమిది పదములదా
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై
మేను హర్ష వర్ష మేఘమై ఆ ఆ ఆ మేని విసురు వాయువేగమై ఆ ఆ ఆ
మేను హర్ష వర్ష మేఘమై మేని విసురు వాయువేగమై
హంగ భంగిమలు గంగ పొంగులై హావ భావములు నింగి రంగులై
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల
జంగమమై జడ ఆడగ జలపాత గీతముల తోడుగ
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా
||అందెల రవమిది||
నయన తేజమే నకారమై
మనో నిశ్చయం మకారమై
శ్వాస చలనమే శికారమై
వాంచితార్ధమే వకారమై
యోచన సకలము యకారమై
నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం
ఓం నమ:శివాయ
భావమె మౌనపు భావ్యము కాదా
భరతమె నిరతము భాగ్యము కాదా
పురుల గిరులు తరిగేల తాండవమాడే వేళ
ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా
ఖగోళాలు పదకింకుణులై పది దిక్కుల ధూర్జటి ఆర్ధృతి రేగా
అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా
అమృత గానమిది పెదవులదా అమితానందపు యద సడిదా
అందెల రవమిది పదములదా


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి