ఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
ఓ ఓ ఓం నమ: శివాయ
చంద్ర కళాధర సహృదయా
చంద్ర కళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా
ఓ ఓ ఓం నమ: శివాయ
ఓం నమ: శివాయ
పంచభూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచభూతములు ముఖ పంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి..పార్వతీ నీతో నడచిన
ఏడు అడుగులే స్వర సప్తకమై
స గ మ ద ని స గ
గ మ ద ని స గ మ
గ గ గ...స స స ..
ని గ మ ద స ని మ గ స
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవరసమ్ములై
తాపస మందారా ఆ ఆ
నీ మౌనమె, దశోపనిషత్తులై ఇల వెలయా
ఓం ఓం ఓం నమ: శివాయ
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజ ముఖ షణ్ముఖ ప్రమదాదులు
నీ సంకల్పానికి ఋద్విజ వరులై
అద్వైతమే నీ ఆది యోగమై
నీ లయలే ఈ కాలగమనమై
కైలాసగిరి వాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓ ఓ ఓ ఓం నమ: శివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా
వాగర్ధావి వసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
వందే పార్వతీప రమేశ్వరౌ
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో ఆ ఆ ఆ భంగిమలో ఆ ఆ ఆ
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీగతి సేయగ
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిని మదని ని ని మదనిసని ని రిసనిదని
మగ మద ద గమ గమ రిగస
కైలసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం
కైలసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం
నవరస నటనం దని సరి సనిస జతియుత గమనం దని సరి సనిస
నవరస నటనం జతియుత గమనం శ్రితగిరి చరణం సురనది పయనం
భరతమైన నాట్యం ఆ బ్రతుకు నిత్య నృత్యం ఆ
భరతమైన నాట్యం ఆ బ్రతుకు నిత్య నృత్యం ఆ
తపముని కిరణం తామస హరణం మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
తపముని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాస్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం
నమక చమక సహజం నటప్రకృతీ పాదజం
నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం
ధిరన నన ధిరన నన ధిరన నన ధిరన నన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెణువులూదాడే మది వెన్నలు దోచాడే
అహహ వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే
అద్వైతమే నీ ఆది యోగమై
నీ లయలే ఈ కాలగమనమై
కైలాసగిరి వాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓ ఓ ఓ ఓం నమ: శివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా
నాద వినోదము
వాగర్ధావి వసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
వందే పార్వతీప రమేశ్వరౌ
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
భావములో ఆ ఆ ఆ భంగిమలో ఆ ఆ ఆ
భావములో భంగిమలో గానములో గమకములో
ఆంగికమౌ తపమీగతి సేయగ
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిని మదని ని ని మదనిసని ని రిసనిదని
మగ మద ద గమ గమ రిగస
కైలసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం
కైలసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం
నవరస నటనం దని సరి సనిస జతియుత గమనం దని సరి సనిస
నవరస నటనం జతియుత గమనం శ్రితగిరి చరణం సురనది పయనం
భరతమైన నాట్యం ఆ బ్రతుకు నిత్య నృత్యం ఆ
భరతమైన నాట్యం ఆ బ్రతుకు నిత్య నృత్యం ఆ
తపముని కిరణం తామస హరణం మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
తపముని కిరణం తామస హరణం శివుని నయన త్రయలాస్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం
ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం
నమక చమక సహజం నటప్రకృతీ పాదజం
నర్తనమే శివకవచం నటరాజ పాద సుమరజం
ధిరన నన ధిరన నన ధిరన నన ధిరన నన
ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర
నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము
వెవేల గోపెమ్మల
వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వెణువులూదాడే మది వెన్నలు దోచాడే
అహహ వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే
మన్ను తిన్న చిన్నవాడే మిన్ను కన్న వన్నెకాడే
కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
మొహనాల వెణువూదే మోహనాంగుడితడేనే
మొహనాల వెణువూదే మోహనాంగుడితడేనే
మొహనాల వెణువూదే మోహనాంగుడితడేనే
మొహనాల వెణువూదే మోహనాంగుడితడేనే
చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వ గొపాలుడే మా ముద్దు గొవిండుడే
అహహ వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే
నీలమయ్ నిఖిలమయ్ కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
అహహ వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వెణువులూదాడే మది వెన్నలు దోచాడే
అహహ వెవేల గోపెమ్మల మువ్వ గొపాలుడే మా ముద్దు గోవిందుడే
తకిట తధిమి తకిట తధిమి తందాన
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా (2)
తెలిసి తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా
తెలిసి తెలియని ఆశల ల ల ల ల లా
ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి
గుండె అలను అందియలుగ చేసి
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తదికిటతోం తదికిటతోం తడికిటతోం
తడిసిన పెదవుల రేగిన ఆ ఆ ఆ
శృతిని లయని ఒకటి చేసి
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్త గిరులుగా వెలిసే సుస్వరాల గొపురం
పలుకు రాగ మధురం
నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్త గిరులుగా వెలిసే సుస్వరాల గొపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్మంగా
అన్న అన్నమయ్య మాట, అచ్చ తేనె తెనుగు పాట
పల్లవించు పద కవితలు పాడీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తకిట తోం తకిట తోం తకిట తోం
తకిట తధిమి తకిట తధిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
వేదం అణువణువున నాదం
గా ప నీ గ మ గ స మ గ స గ స నీ సా ని ద మ గ ని ద మ గ
ద మ గ మ గ స రీ సా ని గ మ గ గ మ గ గ మ గ మ గ ద నీ స నీ స రి
వేదం అణువణువున నాలో
నా పంచ ప్రాణాల నట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం అణువణువున నాలో ఆ ఆ ఆ ఆ
సాగర సంగమమే ఒక యోగం
ని రి స నిద మ గ గ ద మ గ రి సా నీ
ని రి స ని ద మ గా
మ ద ని స రీ సా గా రి మ గ ద మ
గ మ ద ని సా ని ద ని మ ద గ మ రి గ స
సాగర సంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయే
ఆ మథనం ఒక అమృత గీతం
జీవితమే చిర నర్తనమాయె
పదములు తామే పెదవులు కాగా(2)
గుండియలె అందియలై మ్రోగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆఅ
వేదం అణువణువున నాదం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాతృదేవోభవా, పితృదేవోభవా
ఆచర్యదేవోభవ, ఆచర్యదేవోభవ
అతిథి దేవోభవా అతిథి దేవోభవా
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయె జీవం
నట రజ పాదాన తలవాల్చనా
నయనాభిషెకాన తరియించన
నట రజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతము గానా
వేదం అణువణువున నాలో
నా పంచ ప్రాణాల నట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం
జయంతితే సుకృతినో
రస సిద్ధా కవీశ్వరా
నాస్తి క్లేతేశాం యశ: కాయె
జరామరణజం చ భయం
నాస్తి జరామరణం భయం
నాస్తి జరామరజం భయం
వేదం వేదం వేదం వేఏఏఏదం
మాతృదేవోభవా, పితృదేవోభవా
ఆచర్యదేవోభవ, ఆచర్యదేవోభవ
అతిథి దేవోభవా అతిథి దేవోభవా
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయె జీవం
నట రజ పాదాన తలవాల్చనా
నయనాభిషెకాన తరియించన
నట రజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ నిగమము భరతము గానా
వేదం అణువణువున నాలో
నా పంచ ప్రాణాల నట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం
జయంతితే సుకృతినో
రస సిద్ధా కవీశ్వరా
నాస్తి క్లేతేశాం యశ: కాయె
జరామరణజం చ భయం
నాస్తి జరామరణం భయం
నాస్తి జరామరజం భయం
వేదం వేదం వేదం వేఏఏఏదం
బాల కనకమయ చేల
బాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల
సుజన పరిపాల శ్రీ రమాలోల విదృతసార
జాలా శుభద కరుణాలవాల
ఘననీల నవ్య వన మాలికా భరణ
యేల నీ దయ రాదు
పరాకు జేసె వేలా సమయము గాదు..
రారా రారా రారా
రారా దేవాది దేవ
రారా మహానుభవ
రారా దేవాది దేవ
రారా మహానుభవ
రారా దేవాది దేవ
రారా మహానుభవ
రారా రాజీవ నేత్ర
రఘువర పుత్ర.....
సారతర సుధా పూర హృదయ ఆ అ
రారా సారతర సుధా పూర హృదయ
పరివార జలాధి గంభీర ధనుజ
సారతర సుధా పూర హృదయ
పరివార జలాది గంభీర ధనుజ
సంహార దశరథ కుమార బుధ జన
విహార సకల శృతిసార నాదుపై
యేల నీ దయ రాదు
పరాకు చేసే వేల సమయము గాదు
యేల నీ దయ రాదు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి