విధాత తలపున ప్రభవించినది
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం
ఓ ఓ ఓ ఓ ఓం మ్ మ్ మ్ మ్
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం
ఓ ఓ ఓ ఓ ఓం మ్ మ్ మ్ మ్
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం మ్ మ్ మ్ మ్
అ ఆ ఆ ఆ ఆ
సరస్వర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ఈ గీతమ్
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
ప్రార్దిశ వేణియపైన దినకర మయూఖ తంత్రులపైనా
జాగృత విహంగ సతులె వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల స్వరముల స్వరగతి జగతికి శ్రీకారముకాగా
విశ్వకారణమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగధ్వానం
అనాది నాదం ఆది తాళమున అనంత జీవన వాహిని గా సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతమ్
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరస్వర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది (2)
నే పాడిన జీవన గీతం ఈ గీతం
ఈ గాలి ఈ నేల
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నావాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నావాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిసాక (2)
ఉప్పొంగిన గుండెలకేక ఎగసేను నింగిదాకా (2)
ఎగసేను నింగిదాకా
||ఈ గాలి ఈ నేల ||
ఏనాడు ఏ శిల్పి కన్నాడొ ఈ కలను
ఏ ఉలితొ ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలుపుల తలపులతో తెలిపాడొ ఈ కథను
ఏ వలుపుల తలపులతో తెలిపాడొ ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యలాడేను
ఆహహ ఆహహ
||ఈ గాలి ఈ నేల ||
కన్నె మూగమనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న వన్నె చిన్నె కాంతి చినుకులై
కన్నె మూగమనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న వన్నె చిన్నె కాంతి చినుకులై
గగన గళము నుండి అమరగాన వాహిని ఆ….అ…
గగన గళము నుండి అమరగాన వాహిని
జాలువారుతొంది ఇల అమృతవర్షిని అమృతవర్షిని
ఈ స్వాతి వానలొ నా ఆత్మ స్నానమాడె
నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
ఆహహ ఆహహ || ఈ గాలి||
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ
పదము కదిలితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలొ ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై
చిరునవ్వుల సవ్వడి నీవై
నర్తించగ రావేలా
నిను నే కీర్తించే వేళ
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనె ఎన్నెన్ని హొయలొ ఎన్నెన్ని లయలో
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
మెరిసే తారలదే రూపం
మెరిసే తారలదే రూపం
విరిసే పువ్వులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై
వెలసినదేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలొ దేవత ప్రతి రూపం
నీ రూపం అపు రూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఇల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతొ పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రమ్ చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రమ్ చూడాలా
వెదురుని మురళిగ మలిచి
ఈ వెదురుని మురళిగ మలిచి
నాలొ జీవన నాదం పలికిన నీవే
నా హృదయ స్పందన
నీకే నా హృదయ నివేదన

ఆదిభిక్షువు వాడినేది కోరేది
ఆదిభిక్షువు వాడినేది కోరేది బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది
తీపిరాగల కోకిలమ్మకు నల్లరంగునలమిన వాడినేది కొరేది ||2||
కరకు గర్జనల మెఘముల మేనికి మెరుపు హంగుకూర్చిన వాడినేమి అడిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
తేన్నెలొలికే పూబాలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచిన వాడినెమి కోరేది
బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచిన వాడినేమి అదిగేది
ఏది కోరేది వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మథుని మసిచేసినాడు
వాడినేది కొరేది
వరగర్వమున మూడులోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కొరేటి ముప్పు శంకరుడు వాడినేది కొరేది
ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేది
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ
పదము కదిలితే ఎన్నెన్ని లయలో
ఎన్నెన్ని హొయలొ ఎన్నెన్ని లయలో
సిరివెన్నెల నిండిన ఎదపై
చిరునవ్వుల సవ్వడి నీవై
నర్తించగ రావేలా
నిను నే కీర్తించే వేళ
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
అలల పెదవులతో శిలల చెక్కిలిపై
కడలి ముద్దిడు వేళ పుడమి హృదయంలో
ఉప్పొంగి సాగింది అనురాగము
ఉప్పెనగ దూకింది ఈ రాగము
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
కొండల బండల దారులలో తిరిగేటి సెలయేటి గుండెలలో
రా రా రా రమ్మని పిలిచిన కోన పిలుపు వినిపించగనే
ఓ కొత్త వలపు వికసించగనె ఎన్నెన్ని హొయలొ ఎన్నెన్ని లయలో
||ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలొ||
మెరిసే తారలదే రూపం
మెరిసే తారలదే రూపం
విరిసే పువ్వులదే రూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై
వెలసినదేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలొ దేవత ప్రతి రూపం
నీ రూపం అపు రూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఇల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతొ పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రమ్ చూడాలా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రమ్ చూడాలా
వెదురుని మురళిగ మలిచి
ఈ వెదురుని మురళిగ మలిచి
నాలొ జీవన నాదం పలికిన నీవే
నా హృదయ స్పందన
నీకే నా హృదయ నివేదన

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి