శ్రీ మంజునాథ






శ్రీ మంజునాథ స్తుతి 

శ్రీమన్‌ మహామంజునాథా నమో భూతనాథా నమః ప్రాణనాథా నమః ప్రమథ నాథా

నమో విశ్వరూపా నమో వేదదీపా నమో నవ్య కల్పా నమో నిర్వికల్పా

నమః స్సగుణ ద్విగుణా నమః సర్వదమనా  నమః షమిత మదనా నమః శాంతి సదనా 

శ్రీచరణ సంసారసంతాపహరణా వాత్సల్య వరుణా ప్రారబ్ధి దయకారణా సృష్టి స్థితి ప్రళయకారణా

పంచముఖ సకల ప్రపంచ సుఖ సుముఖ విషాదాంత విముఖ ప్రదైవ తత్‌ప్రముఖ నమో ధర్మతిలకా

నమోనంత హస్తా నమోనంత నేత్రా నమోభవ్య శస్త్రాస్త్ర నవచిత్ర దాత్రా

నమో దివ్య ధర్మస్థల క్షేత్ర నాథా  మహ మంజునాథా జయ మంజునాథా శ్రీ మంజునాథా 

నమః ప్రాణి భవ బంధ మోక్ష ప్రదాత  నమస్తే నమస్తే నమస్తే నమః 

మహ మంజునాథా జయ మంజునాథా శ్రీ మంజునాథా  

ఓం అక్షరాయ నమః
ఓం  మ్ మ్ మ్ మ్  ఓం   మ్ మ్ మ్ మ్ 

ఓం క్షరాయ నమః ద్యంత రహితాయ నమః                                                      
ఇందీవరదళశ్యామాయ నమః శ్వరాయ నమః
పకార ప్రియాయ నమః ర్ధ్వ లింగాయ నమః
గ్యజుస్సామ సంభూతాయ నమః 
కార మాతృకావర్ణ రూపాయ నమః 
గ్వతాయ నమః ఓం అక్షరాయ నమః 
నితాఖిల దైత్యాయ నమః జితాఖిల సంశ్రయాయ నమః  
హితామూష్మికా వరదాయ నమః జస్వతే నమః 
దార్య నిధయే నమః అంబికా పతయే నమః

పర్ధినే నమః ట్వాంగినే నమః 
ణనాథాయ నమః ఓం అక్షరాయ నమః
నానందాయ నమః ఙ్సేవితాయ నమః  

చంద్రశేఖరాయ నమః ఛందోవ్యాకరణసారాయ నమః    
నప్రియాయ నమః ఝంఝానిల మహావేగాయ నమః  
ఞంబంజితాయ నమః 

టంకార నృత్య విభవాయ నమః  
ఠం శబ్దప్రియాయ నమః ఓం అక్షరాయ నమః
డం డం డం డంబాయ నమః ఢంకా నినాద ముదితాయ నమః 
గా రి స ని దా ప మ ట్రంజితాయ నమః    

త్వమసి తత్వాయ నమః థా స్వరూపాయ నమః
క్షిణామూర్తయే నమః, రణీధరాయ నమః  
ర్మస్థలనివాసాయ నమః నందీ ప్రియాయ నమః

ఓం అక్షరాయ నమః 

రాత్పరాయ నమః ణిభూషణాయ నమః 
హుభూరితాయ నమః వ్యాయ నమః
హమంజునాథాయ నమః 

జ్ఞ జ్ఞాయ నమః  రక్ష క్షాకరాయ నమః 
మ గ రి గ మ ప ద ని స రి క్ష్యాయ నమః  
రేణ్యాయ నమః బ్దబ్రహ్మణ్యే నమః డాధారాయ నమః  

 స రి గ మ ప ద ని స ని ద ప మ గ రి స
 ప్తస్వరాయ నమః, రాయ నమః క్షమ పరాపరాయణాయ నమః నమః నమః 
 
మహా ప్రాణ దీపం శివం శివం

మహా ప్రాణ దీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాడ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథం

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓమ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
నమ: శంకరాయచ మయస్కరాయచ నమ: శివాయచ శివతరాయచ భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్థనారీశ్వరం హ్రుదశహ్రుదయంగమం
చతురుదది సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం
సప్త స్వరేశ్వరం అష్ట సిద్దీశ్వరం నవరస మనోహరం దశదిశాసువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణత జనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం
రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భుతేశం
మహామధుర పంచాక్షరీ మంత్ర పాశం మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓఓఓఓఓఓఓఓఓఓఓం ..నమో హరాయచ స్వర హరాయచ పుర హరాయచ రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిత్యాయచ..

మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాథం శివం శివం

డమ్ డమ్ డ డమ్ డమ్ డ డమ్ డమ్ డ డమ్ డమ్ డ ఢంకానినాదనవ తాండవాడంబరం
తథిమ్మి తకధిమ్మి ధిధిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య శుభ కమల భంభరం
ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామప్రగీతం అథర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం..ప్రపంచైకసూత్రం విరుద్ధమ్ సుసిద్ధం...

నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సారకరం
మహాకాలకాలం మహా నీలకంఠం మహానందనందం మహాట్టాట్టహాసం
జటా జూట రంగైక గంగా సుచిత్రం..జ్వలద్రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం..
మహాకాశబాశo మహాభానులింగం...మహాభార్తృవర్ణం సువర్ణం ప్రవర్ణం..

సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం; శ్రీశైల మందిరం శ్రీమల్లిఖార్జునం
ఉజ్జైని పుర మహాకాళేశ్వరం; వైద్యనాథేశ్వరం; మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం; వామ లింగేశ్వరమ్;కాశి విశ్వేశ్వరం; పరం ఘ్రిష్మేశ్వరం
త్రయంబకాధీశ్వరమ్; నాగలింగేశ్వరం.. శ్రీ....కేదారలింగేశ్వరం

అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకo
అనాదిం అమేయం అజేయం అచిత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం (2)

ధర్మస్థలక్షేత్ర వర పరంజ్యోతిం....(3)

ఓఓఓఓఓఓం....నమ:
సొమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ శాంతాయచ శౌర్యాయచ
యోగయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ  గమ్యాయచ
ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచా ఆ ఆ ఆ


ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే   
శక్తికీ రక్తికీ ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడె
ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే 

నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ  
దర్శించె మనసు ఉంటె నీలో నె ఉన్నానన్నవు   
లోకాన దొర కాదు దొంగవని చాటాను మంజునాథ మంజునాథ  
నా పాప రాశులన్ని దొంగల్లె దోచుకు పొయావు
శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడె దిక్కొక్కడె   

ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే 

శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా  
జయ జయ శంభో జయ జయ గంగధర

నా ఆర్తి తీర్చావు నా దారి మర్చావు మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు 
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాథ  మంజునాథ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే ధర్మము మర్మము ఒక్కడె హరుడొక్కడె  

శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధరా శంకరా 
జయ జయ శంభో జయ జయ గంగధర   

మురహర భవహర శంభో హర హరా 
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ 

ఆనంద పరమానంద 

ఆనంద పరమానంద పరమానంద  
ఆనంద పరమానంద పరమానంద 
జగతి నీదె జన్మ నీదె జగదానంద 
ఆట నీదె పాట నీదె ఆత్మానంద 
నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస

ఆనంద పరమానంద పరమానంద

మాయల వలలోన జీవుల బంధించి 
మురియుట ఒక ఆట ధర్మానంద
యదలో గరళాన్ని మధురసుధగ మార్చి నవ్వించుటొక
ఆట మొహానంద

పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట
ప్రానదాత బ్రహ్మరాత నీ మాయెర 
ఆది నీదె అంతు నీదె అమరానంద 

నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస

ఆనంద పరమానంద పరమానంద

గంగను తలదాల్చి ధరణికి మరలించి
స్వర్గంగ మార్చావు మధురానంద 
పుతృడ్ని కరుణించి పుఃన్నామ నరకాన్ని లేకుండ చేస్తావు స్వర్గానంద  

దాన ధర్మాల ఫలితాలె పసివాళ్ళు 
దాన ధర్మాల ఫలితాలె పసివాళ్ళు 
కన్నవాళ్ళ కర్మలేగ పుణ్యానంద    
కర్త నువ్వె కర్మ నువ్వె కరుణానంద  

నిసరి సరిగ మమరిస నిసరిస దనిపమ గమరిస

ఆనంద పరమానంద పరమానంద పరమానందా పరమానందా  

ఈ పాదం పుణ్యపాదం 


ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం  

ప్రణవమూలనాదం ప్రథమలోక పాదం
ప్రణతులే చేయలేని ఈ కరమేల ఈ కరమేల  
ఈ పాదం పుణ్యపాదం ధరనేలె ధర్మపాదం 

మార్కణ్డేయ రక్షపాదం మహపాదం ఆ… ఆ…
మార్కణ్డేయ రక్షపాదం మహపాదం
భక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం
భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదం 
ఆత్మలింగ స్వయంపూర్ణ   
ఆత్మలింగ స్వయం పూర్ణుడే సాక్షాత్కరించిన 
చేయుతనీడిన అయ్యో అందని అనాథనైతీ మంజునాథా    

ఈ పాదం పుణ్యపాదం ధరనేలె ధర్మపాదం 
ప్రణయ మూలపాదం ప్రళయ నాట్య పాదం 
ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల
ఈ పాదం పుణ్యపాదం ధరనేలె ధర్మపాదం   

భక్త శిరియాళునేలిన ప్రేమపాదం ఆ ఆ
భక్త శిరియాళునేలిన ప్రేమపాదం 
బ్రహ్మవిష్ణులే భజించె ఆది పాదమనాది పాదం
బ్రహ్మవిష్ణులే భజించె ఆది పాదమనాది పాదం  

అన్నదాత విశ్వనాథా  
అన్నదాత విశ్వనాథుడే లీలవినోదిగా నన్నేలగ  దిగిరాగా అయ్యో 
ఛీ పొమ్మంటినె పాపినైతినే 

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం ధన్య పాదం 
సకల ప్రాణ పాదం సర్వమోక్ష పాదం 
తెలుసుకోలేని నాయీ తెలివేల ఈ తనువేల 

ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్య పాదం 

శ్రీమంజునాథ నిందా స్తుతి పాట  

ఆ హ హ హ హ హ హ హ హ రుద్రా వీరభద్ర 
కైలసాన నీకు సుభిక్షం సుభిక్షం
నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం
రుద్ర ఎయ్ వీరభద్ర ఈ నమ్మనివాళ్ళ చేతచిక్కితే
నిను చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు 
రుద్ర చిత్తు చిత్తు చిత్తు చిత్ర చిత్తు చేస్త 

ఓహో గరళకంఠ నీ మాటంటె ఒళ్ళు మంట 
కన్నొళ్ళే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట 
ఓహో గరళకంఠ నీ మాటంటె ఒళ్ళు మంట 
కన్నొళ్ళే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట  
దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ  
దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ

హే ఈశ్వర సర్వ లొకేశ్వర గంగాధరా గౌరీవరా శ్రీమంజునాథ నమో     
ఓహో గరళకంఠ నీ మాటంటె ఒళ్ళు మంట   
కన్నొళ్ళే లేరంట ఎట్ట పుట్టావొ చెప్పమంట   


ఓహో నుదుటె ఉన్నదంట ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకౌతుంది మన్ను 

హే లయకార జననం మరణం నీకొక ఆట 
లీలా లోలా లోలా
ఓహో భుతనాథ నీ చేత ఎందుకంట ఇంత బారు  తిరుశూలం నిన్ను నమ్మినోడికి పొకాలం 
హే హే త్రిగుణేశా త్రికాల కారకమే ఆ శూలం చూస్తే ధన్యం ధన్యం

బిల్వపత్రమంటె మొజా నీకు రుద్ర  
అందులోనె పెట్టి ముంచుతాను రా రా రుద్ర 
తిరుపమెత్తి తిరిగెటోడ కాటి రుద్ర 
నీది యొగ నిద్ర కానె కాదు దొంగ నిద్ర 

యొగేశ్వరా సర్వలొకేశ్వరా సాకరుడా నిరాకరుడా శ్రీమంజునాథ నమో  
ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట
కన్నొళ్ళె లేరంట ఎట్ట పుట్టావొ చెప్పమంట   

సకలం స్వాహా చేస్తావు గుర్రు కొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు
హే చిదృపా నువ్వే నిద్దుర లేచిన వేళ అంతమే అనంతం  

శవగణ భుతగణ వాసనలతో కులికెటోడ నీతొ పార్వతెట్ట ఉంటదొ 
గంగ ఎంత మొత్తుకుంట  తెర్లుతుంటదొ హె 
హే నీలకంఠ హాలహలమును గ్రోలెదవయ్య ఈయగా అమృతం 
 
శుచి రుచి ఉన్న చొట ఉండవంట నీకు పచ్చి మధ్యమాంసాలంటె ఇష్టమంట   
గణ గణ గంట కొడితె వస్తవంటఇటు రా నిన్ను విరిచి నంజుకుంట

ఓహో గరళకంఠ నీ మాటంటే ఒళ్ళు మంట 
కన్నొళ్ళె లేరంట ఎట్ట పుట్టావొ చెప్పమంట 
దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ 
దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ భ్రష్ట శివ

హే ఈశ్వర సర్వ లొకేశ్వర హే ఈశ్వర సర్వ లొకేశ్వర 
ఓహో గరళకంఠ నీ మటంటే ఒళ్ళు మంట
కన్నొళ్ళె లెరంట ఎట్ట పుట్టావొ చెప్పమంట   

స్వాగతమయ్య ఓ యమరాజ

ప్రాణాలనే పంచబక్షాలుగా అర్పించెదర యమరాజా ఆ  ఆ శివ 

స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ 
స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ  
ఈ మాయ తెర దింపేయగా రార  

శ్వాస నువ్వె శాంతి నువ్వె స్వర్గమిచ్చె సఖుడు నువ్వే  మృత్యుదేవ 
ఎందరున్నా ఎన్ని వున్నా వెంట వచ్చె చివరి తోడు మరణమేరా 
లేనిదే పోదురా పోనిదే రాదురా  ఆలించరా పరిపాలించరా
కొనిపోరా యమరాజా ఆ ఆ హర
తనువొక మాయ ఓ జవరాయ ఓ జవరాయ ఓ జవరాయ    
ఈ మాయ తెర దింపేయగా రారా 

ముద్దు చేసి ముడిని తెంచి యదను చేర్చి ఎత్తుకెళ్ళే తండ్రి నువ్వె 
లాలి పాడి నిదురపుచ్చి వల్లకాటి ఒడికి చేర్చె తల్లి నువ్వె  
లెక్కలే చెల్లెరా బంధమే తీరెరా పాలించరా పంట పండిందిరా 
కరుణామయ కడ తేర్చరా ఆ ఆ ఈశ్వర     

స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ
స్వాగతమయ్య ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ

యెన్ని జన్మల ఫలమిదీ యెన్ని తపసుల వరమిదీ 
అన్నపూర్ణాదేవి ప్రియముగ అరముద్దలు చేస్తి పెడితే 
ఆరగించే ఆదిభిక్షువు ఆడుకొను ఆటే ఇది ఆడుకొను ఆటే ఇదీ 
భక్తుడే ఆడించినట్టు ఆడుతున్న ఆటిది ఆడుతున్న ఆటిదీ     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...