నర్తనశాల

 
పదకర్త - సముద్రాల రాఘవాచర్యులు 
స్వరకర్త - సుసర్ల దక్షిణామూర్తి   
గానం - ఘంటసాల వేంకటేశ్వర రావు,మంగళంపల్లి బాల మురళికృష్ణ, యస్. జానకి, పి. సుశీల     

జననీ శివ కామిని



జననీ శివ కామిని,జయ శుభ కారిణి
విజయ రూపిణి, జననీ శివ కామిని

అమ్మవు నీవే అఖిల జగాలకు, అమ్మలగన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితనమ్మా ,శరణము కోరితినమ్మా భవానీ

జననీ శివ కామిని,జయ శుభ కారిణి
విజయ రూపిణి, జననీ శివ కామిని

నీ దరి నున్న తొలగు భయాలు, నీ దయ నున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి, నిరతము మాకు నీడగ నిలచి
జయమునీయవే అమ్మా, జయమునీయవే అమ్మా భవానీ

జననీ శివ కామిని,జయ శుభ కారిణి
విజయ రూపిణి, జననీ శివ కామిని

సలలిత రాగ సుధారస సారం

ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ అ

సలలిత రాగ సుధారస సారం
సలలిత రాగ సుధారస సారం 
సర్వ కళామయ నాట్య విలాసం
సర్వ కళామయ నాట్య విలాసం 
సలలిత రాగ సుధారస సారం 


మంజుల సౌరభ సుమ కుంజముల
మంజుల సౌరభ సుమ కుంజముల 
రంజిలు మధుకర మృదు ఝంకారం 
రంజిలు మధుకర మృదు ఝంకారం

సలలిత రాగ సుధా రస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రస సారం  

ని దా ద స నీ ప ని దా ప

మ గ మ ద ప స రి సా
ఆ.. ఆ.. ఆ

కల్పనలో ఊహించిన హొయలు  ఉ ఉ ఉ 
ఆ..ఆ ఆ ఆ ఆ..
కల్పనలో ఊహించిన హొయలు 
శిల్ప మనోహర రూపము నొంది
శిల్ప మనోహర రూపము నొంది 
పద కరణముల మృదు భంగిమల 
పద కరణముల మృదు భంగిమలా   
ముదమార లయమీరు నటనాల సాగె
 
సలలిత రాగ సుధా రస సారం

ఝణణ ఝణణ ఝణ నూపుర నాదం 
అ ఆ ఆ
అ ఆ ఆ
అ ఆ ఆ
అ ఆ ఆ
అ ఆ ఆ
అ ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ అ అ ఆ ఆఅ
అ ఆ ఆ.. ఆ ఆ ఆ
ఆ ఆ ఆ అ ఆఅ ఆఅ
ఆ అ ఆఅ ఆ ఆ ఆ
ఝణణ ఝణణ ఝణ నూపుర నాదం 
భువిలో దివిలో రవళింపగా   

ప ద ప మ పా
ఆ ఆ ఆఅ
మ ని ద మ దా
అ ఆ ఆ
గ మ ద ని రీ సా
అ ఆ అ ఆ
రీ సా రీ సా ని ప ద దా ని
సా నీ దా మ ప నె నీ దా
నీ దా ప మ గ ప

భువిలో దివిలో రవళింపగా 
నాట్యము సలిపె నటరాయని 
నాట్యము సలిపె నటరాయని 
ఆనంద లీల వినోదమె 

సలలిత రాగ సుధా రస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలిత రాగ సుధా రస సారం 

సఖియా వివరించవే

సఖియా వివరించవే, సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా,సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా,సఖియా వివరించవే

నిన్ను జూచి కనులు చెదిరి, కన్నె మనసు కానుక జేసి.
మరువ లేక మనసు రాక,విరహాన చెలి కాన వేగేననీ .
సఖియా వివరించవే

మల్లెపూలా మనసు దోచి, పిల్లగాలి వీచేవేళ 
మల్లెపూలా మనసు దోచి, పిల్లగాలి వీచేవేళ
చలువరేని వెలుగులోనా, సరసాల సరదాలు తీరేనని 

సఖియా వివరించవే,వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే

జయగణనాయక విఘ్నవినాయక

జయగణనాయక విఘ్నవినాయక
భయహర శుభకర గజముఖ గణపతి
భయహర శుభకర గజముఖ గణపతి
మూషిక వాహన త్రిభువన పూజిత
మూషిక వాహన త్రిభువన పూజిత
గణపతి వినుతీ చేసెద వినుమా 
 
సా ని పా మ గ మ దా
స గ మ ప ని
సా ని పా మ గ మ దా
సా ప ప నీ ని ని సా స స సా స స
సా ప ప నీ నిని సాసస సాసస
స గ రి మ గ రి స స
స గ రి మ గ రి స స
స స రి సా న్ని మ ప ని పా మ ప న్ని
స స రి సా న్ని మ ప ని పా మ ప న్ని
సా ని పా మ గ మ దా స గ మ ప ని
సా ని పా మ గ మ దా

ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా
ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా
స్వరగతుల జతుల సరిజోడుగ
పా, సా, పా, ద, ప, మ,గ ,రి, స,ని
తా ధీం తా తకుం దరిత కిట
స్వరగతుల జతుల సరిజోడుగ
చరణ కింకిణులు ఘల్లనగా
ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా

నారదుడూ కలగానము సేయ ఆ ఆ ఆ ఆ 
శారద హయిగ వీణను మీటా
నారదుడూ కలగానము సేయ
శారద హయిగ వీణను మీట
భృంగీశుడూ...ఊ ఊ ఊ ఊ 
భృంగీశుడూ లయరీతులు గొలుప
భృంగీశుడూ లయరీతులు గొలుప
భరతుడు తది  యని కొనగోలు పలుకగా

ఆడినదీ గిరి రాజుసుతా
నటరాజు మదీ రంజిలగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...