కానరార కైలాస నివాస
కానరార కైలాస నివాస, బాలేందుధరా జటాధరా హరా
కానరార కైలాస నివాస, బాలేందుధరా జటాధరా... కానరార
భక్తజాల పరిపాల దయాళ, భక్తజాళ పరిపాల దయాళ
హిమశైల సుత ప్రేమ లోల, కానరార కైలాస నివాస
బాలేందుధరా జటాధరా... కానరార
నిన్ను చూడ మది కోరితిరా,
నిన్ను చూడ మది కోరితిరా, నీ సన్నిధానమున చేరితిరా
నిన్ను చూడ మది కోరితిరా, నీ సన్నిధానమున చేరితిరా
కన్నడ సేయక కన్నులు చల్లగ, మన్నన సేయరా గిరిజా రమణా
కానరార కైలాస నివాస, బాలేందుధరా జటాధరా... కానరార
సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ, సర్పభూషితాంగ కందర్ప దర్ప భంగ
భవపాశ నాశ పార్వతీ మనోహర , హే మహేశ వ్యోమకేశ త్రిపుర హర
కానరార కైలాస నివాస, బాలేందుధరా జటాధరా... కానరార
హ హ హ హ హ
నందీ నా భక్తినే పరిహసిస్తున్నావా
ప్రేమతో స్వామి సాక్షాత్కరించకపొతే
పొలవితో ఈ కైలాసాన్నే పెకలించి నా లంకా ద్వీపానికి తరలించుకుపోతాను
జయత్వదబ్ భ్రవిద్భ్రమద్భుజంగ మస్ఫురత్
ధగ ధగత్ వినిర్గమత్ కరాళఫాల హవ్యవాత్
ధిమి ధిమి ధిమిత్ ధ్వనన్మృదంగ తుంగ మణ్గళా
ధ్వనిఘ్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివః
ఓం నమః శివాయ
అగర్వ సర్వమణ్గల కళా కదంబ మంజరీ
రసప్రవాహ మాధురీ విజృంభణా మధూవ్రతం
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
ఓం నమః హరా
ప్రఫుల్లనీల పంకజ ప్రపంచ కాలి మఝ్ఝటా
విడంబి కణ్ఠ కంధరా రుచి ప్రభంధ కందకంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛికాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే
సీతారాముల కళ్యాణము చూతమురారండి
సీతారాముల కళ్యాణము చూతమురారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి, బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి, నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి, ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి, పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణము చూతమురారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి
సంపగి నూనెను కురులను దువ్వి, కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి, నామము తీర్చి
చెంపగవాసికి చుక్కను పెట్టి , ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాసికి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణము చూతమురారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై, కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపురాశై , నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా, ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
నిన్ను విడచి తనను మరిచి హుంకరించు అహంకారీ
కానలేడు నీ మహిమా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కానలేడు నీ మహిమ నటన సూత్రధారి
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అఖిల జగతి సృష్టిజేసి ఆడి పాడి అంతలోనె
అఖిల జగతి సృష్టిజేసి ఆడి పాడి అంతలోనె
ఆపెదవూ బొమ్మలాట నటన సూత్రధారి
దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి