శ్రీరామ నామాలు శతకోటి (మీనా)



శ్రీరామ నామాలు శతకోటి

ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి

శ్రీరామ నామాలు శతకోటి 


తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు దశరథ రామయ్య  స్థవనీయుడు (2)  

నడుమేటి విలువిరిచి కలికిని చేపట్టు కళ్యాణ రామయ్య కమనీయుడు.. కమనీయుడు  


శ్రీరామ నామాలు శతకోటి

ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి

శ్రీరామ నామాలు శతకోటి 


సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి సుందర  రామయ్య సుకుమారుడు..(2)  

కోతి మూకలతో... ఆ...కోతి మూకలతో లంకపై దండెత్తు కోదండ రామయ్య రణధీరుడు.. రణధీరుడు(2)   


శ్రీరామ నామాలు శతకోటి

ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి

శ్రీరామ నామాలు శతకోటి 


పవమాన సుతుడు పాదాలు పట్టగ పట్టాభి రామయ్య పరంధాముడు (2)

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు అచ్యుత రామయ్య అఖిలాత్ముడు.. అఖిలాత్ముడు    


శ్రీరామ నామాలు శతకోటి

ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి

శ్రీరామ నామాలు శతకోటి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...