స్వాతి కిరణం





తెలిమంచు కరిగింది 

తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
ఈ త్రోవపొడవున కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం

తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఊ ఊ

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభు పవళించు భువనాలు
భానుమూర్తీ నీ ప్రాణ కీర్తన విని
పలుకని ప్రణతులె నీ ప్రణవ శృతిని
పాడని ప్రకృతిని ప్రథమ కృతిని

తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఊ ఊ

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు (2)
పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు
తలయూచు తలిరాకు బహుపరాక్కులు విని దొరలని
దోరనగవు దొంతరని తరలనీ దారి తొలగి రాతిరిని

తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఊ ఊ

కొండా కోనల్లో 

కొండా కోనల్లో లోయల్లో గొదారి గంగమ్మా సాయల్లో
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మా
కొండా కోనల్లో లోయల్లో గొదారి గంగమ్మా సాయల్లో

నేల పల్లవి పాడంగ నీలి మబ్బు ఆడంగ
రివ్వున గువ్వే సాగంగ నవ్వె మువ్వై మోగంగ
నీలి మబ్బు ఆడంగ రివ్వున గువ్వే సాగంగ
ఉంగా ఉంగా రాగంగ హ ఉల్లాసాలె ఊరంగా (2)
ఊపిరి ఊయలలూగంగ రేపటి ఆశలు తీరంగా
తెనుగుదనం నోరూరంగ తేట గేతి గారాబంగా (2)
తిన్నరపై ఊరేగంగ వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో గొదారి గంగమ్మా సాయల్లో
గొదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తీయంగ కమ్మని రాగం తీయంగా
జాజి మల్లె సంపెంగ జానపదాలె నెప్పంగా
కమ్మని రాగం తీయంగా జానపదాలె నెప్పంగా
చెట్టుపుట్ట నెయ్యంగా చెట్టాపట్టా లెయ్యంగా
చెట్టుపుట్ట నెయ్యంగా  హ చెట్టాపట్టా లెయ్యంగా
చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా
యేటిపాట లాలించంగా తోటతల్లి లాలించంగ (2)
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో గొదారి గంగమ్మా సాయల్లో
కొండా కోనల్లో లోయల్లో గొదారి గంగమ్మా సాయల్లో
 గొదారి గంగమ్మా సాయల్లో


ఆనతి నీయరా హర

ఆనతి నీయరా హరా

సన్నుతి సేయగ  సమ్మతినీయరా దొర
సన్నిధి జేరగ ఆనతినీయరా హరా

నీ ఆన లేనిదే రచింపజాలున వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగున ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతీ క్షణం పశుపతి నీ అధీనమై (2)
కదులునుగా సదా సదా శివ

ఆనతి నీయరా హరా

నిని సని పని పమ గసగ ఆనతినీయర
అచలనాద అర్చింతునురా ఆనతి నీయరా

పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగ సనిపమ గమగస సగసరి

ఆనతి నీయరా హరా

జంగమ దేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడర
సాష్టాంగముగ దండము సేతురా

ఆనతి నీయరా

సనిప గమ ప నిపమ
గమగ పపపప మపని పపపప
గగమ గససస నిసగ సససస
సగగస గపపమ పసనిస
ససని సగ సగ సని సగ సగ
సగ గస సస సని సగగ
గసగ గ పమ గసగ  సనిపమ నిపమ గమగ

ఆనతి నీయరా

శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకుని
విషపు నాగులను చంకనెత్తుకుని నిలకడ నెరుగని గంగనేలి
యే వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనీయవేమి
నీ కింకరునిగ సేవించుకుందురా

ఆనతి నీయరా

పప పమ పనిని పమగస గగ
పప పమ పనిని పమగస గగ
గమపనిగ మపనిసమ పనిసగ నిస పని మప గమ సగమ
పప పమ పనిని పమగస గగ
గమపనిగ మపనిసమ పనిసగ నిస పని మప గమ సగమ
పప పమ పనిని పమగస గగ

గమపని గమపని సమపని సగని
గమపని గమపని సమపని సగ నిస పని మప గమ సగమ
పప పమ పనిని పమగస గగ..గాగ

గమపని గమపని సమపని సగనిస పనిమప గమ సగమ
పప పమ పనిని పమగస గగ..గగ

గగమమ పపనిగ .. తక తకిట తకదిమి
మమపప నినిసమ .. తక తకిట తకదిమి
పపనిని ససగని .. తక తకిట తకదిమి
సపని మప గమ సగమ
పప పమ పనిని పమగస గగ..గగ

రక్షా ధరాశిక్షాదీక్ష ద్రక్ష  విరూపాక్ష
నీ కౄపావీక్షణాపేక్షిత ప్రతీక్షణుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్థన వినరా

ఆనతి నీయరా హరా

సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా
సన్నిధిజేరగ ఆనతినీయరా హరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ  ఆ ఆ ఆ

వైష్ణవి భార్గవి వాగ్దేవి

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ద సాధికె సత్యార్థ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

||వైష్ణవి ||

ఆ పాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీ భారతి క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరదుని సారవరూధుని సామసునాద వినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకిని మాంపాహి సుజ్ఞాన సంవర్ధిని

||వైష్ణవి ||

అలోచనామృతము సాహిత్యము సహితహిత సత్యము శారదా స్తన్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మ సాఫల్యము
సరసవ శోబ్ధిని సారసలోచని వాణి పుస్తక ధారిణి
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణి
మాంపాహి  సాలోక్యసంధాయిని మాంపాహి శ్రీచక్ర సింహాసిని

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్య విలాసిని వారహి త్రిపురామ్బికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ద సాధికె సత్యార్థ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే


శృతి నీవు

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి (2)

ఈనా కృతి నీవు భారతి
ఈ నా కృతి నీవు భారతి

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి (2)
శరణా గతి నీవు భారతి

నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ద నిధులున్న నెలవు
కోరిన మిగిలిన కొరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప
చేరినా యిక చెరువున్న దేమి నీ శ్రీ చరణ దివ్యసన్నిధి తప్ప

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

శ్రీనాథ కవి నాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే
శ్రీనాథ కవి నాధ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే
అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గళసీమ రావిల్లిన అనంత రాగాలు నీమూర్తులె
నీ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం

శ్రుతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతీ...

సంగీత సాహిత్య

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసానమామి (2)

వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని
నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని
వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞాననవల్లి సఉల్లాసిని

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసానమామి

బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి
నిత్య చైతన్య నిజరూపిని సత్య సందీపిని
సకల సుకళా సమున్వేషిని
సకల సుకళా సమున్వేషిని
సర్వ రస భావ సందీపిని

సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే
హే భారతి మనసాస్మరామి శ్రీ భారతీ  శిరసానమామి


ప్రణతి ప్రణతి ప్రణతి

సా రి గ మ ప మ గ మ స రి ని రి స
ప మ గ మ స రి
సా రి గ మ ప ని స ని ప మ గ మ స రె ని రి సా

ప్రణతి ప్రణతి ప్రణతి
ప మ ప మ గ మ స రి సా
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
పమప మమప మ ప నీ
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రథమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికీ

పూల యెదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుకపికాది కలరవం ఐంకారమా
పూల యెదలలో పులకలు పొడిపించే భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై సుకపికాది కలరవం ఐంకారమా
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమా హ్రీంకారమా
గిరుల శిరసులను జారే ఝరుల నదుల వడి అలజడి శ్రీంకారమ  శ్రీంకారమా
ఆ బీజాక్షర విగతికి అర్పించే ద్యోతలివే

పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవనమా
మ గ మ పా ప మ పా పా ప ప ప నిప్పప నిపపప నిపాపప మ గ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేళనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొడల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమా అది చిత్రమా
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ  కల్పనా అది శిల్పమా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్టికి అర్పించే ద్యోతలివే


జాలిగా జాబిలమ్మ

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా
రెప్పవెయ్యనే లేదు ఎందుచేత ఎందుచేత
పదహారు కళలని పదిలంగా ఉంచనీ (2)
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

మ్ మ్ మ్ మ్ మ్

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

కాటుక కంటినీరు పెదవుల నంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబోనీయకు
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా (2)
నీ కుంకుమకెపుడూ ప్రొద్దుగూకదమ్మా

మ్ మ్ మ్ మ్ మ్

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతీ
సుతుడన్న మతిమరచి శూలాన మెడవిరచి
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి
ప్రాణపతినంటుందా బిడ్డగతి కంటుందా (2)
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి
కాలకూటంకన్నా ఘాటైన గరళమిది
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది

 మ్ మ్ మ్ మ్ మ్

ఆటూ పోటు ఘటనలివి ఆట విడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగిన్చి చెబుతున్నా
కంచికెళ్ళిపొయేవే కథలన్ని

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ముందు మాట

ఈ బ్లాగులో నాకు నచ్చిన కొన్ని మరపు రాని చిత్రగీతాలను పొందుపరుచుకుంటున్నను. ఈ చిత్రాలలోని సంగీతం, సాహిత్యం, గానం తెలుగు తనం ఉట్టి పడేలా ఉంట...