నీల కంధర దేవా
శంభో సదాశివ ఆశ్రిత మందారా
శృతి శిఖర సంచారా ఆ ఆ
నీల కంధర దేవా దీన బాంధవ రారా నన్ను గావర
నీల కంధర దేవా దీన బాంధవ రారా నన్ను గావర
సత్య సుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
సత్య సుందరా స్వామీ నిత్య నిర్మలా పాహీ
నీల కంధర దేవ దీన బాంధవ రారా నన్నుగావర
అన్య దైవమూ గొలువా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అన్య దైవమూ గొలువా నీదు పాదము విడువ
అన్య దైవమూ గొలువా నీదు పాదము విడువ
దర్శనమ్మునీర మణ్గళాణ్గ గంగాధరా
దర్శనమ్మునీర మణ్గళాణ్గ గంగాధరా
నీల కంధర దేవా దీన బాంధవ రార నన్నుగావర
దేహి అన వరములిడు దానగుణసీమ
పాహి అన్నను ముక్తినిడు పరంధామ
నీమము నీ దివ్యనామ సంస్మరణా
ఏమరక చేయుతును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములారా
వర సుధావృష్టి నా వాంఛలీడే రా
కరుణించు పరమేశ దరహాసభాసా
హర హర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ
నాగభూషణ నన్ను కావగ జాగును చేయకయ
ఫాల లోచన నాదు మొరలిడి జాలిని చూపుమయ
నాగభూషణ నన్ను గావగ జాగును చేయకయ
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా
ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ
నాగభూషణ నన్ను కావగ జాగును చేయకయ
శంకరా శివ శంకరా అభయంకర విజయంకర
శంకరా శివ శంకరా అభయంకర విజయంకర
శంకరా శివ శంకరా అభయంకర విజయంకర
దేవ దేవ ధవళాచల మందిర
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంభుది హిమకర లోక శుభంకర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంభుది హిమకర లోక శుభంకర నమో నమో
నమో నమో నమో నమో
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమో నమో
పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమో నమో
హాలహలధర శూలయుధధర శైల సుతావర నమో నమో
హాలహలధర శూలయుధధర శైల సుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంభుది హిమకర లోక శుభంకర నమో నమో
దురితవిమోచన ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దురితవిమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
దురితవిమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరి చర్మంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో
కరి చర్మంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో
దైవత లోక సుధాంభుది హిమకర లోక శుభంకర
నమో నమో
నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
నారదహృదయవిహారి నమో నమో నారదహృదయవిహారి నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన
శంకర వినుతా నమో నమో శంకర వినుతా నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నారయణ హరినారయణ హరి నమో నమో
మున్నీట పవళించు నాగశయనా
మున్నీట పవళించు నాగశయనా
మున్నీట పవళించు నాగశయనా
చిన్నారి దేవేరి సేవలు చేయ
మున్నీట పవళించు నాగశయనా
నీ నాభి కమలాన కొలువు జేసే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ నాభి కమలాన కొలువు జేసే
వాణీశు భుజ పీఠి బరువు వేసే
వాణీశు భుజ పీఠి బరువు వేసి
పాల మున్నీట పవళించు నాగశయనా
మీనాకృతి దాల్చినావు
వేదాల రక్షింప మీనాకృతి దాల్చినావు
కూర్మాకృతి బూనినావు
వారిధి మధియింప కూర్మాకృతి బూనినావు
కిటి రూపము దాల్చినావు
కనకాక్షు వధియింప కిటి రూపము దాల్చినావు
నరసింహమై వెలసినావు
ప్రహ్లాదు రక్షింప నరసింహమై వెలసినావు
నరసింహమై వెలసినావు
నట పాల మము నేల జాగేల
నట పాల మము నేల జాగేల
పాల మున్నీటా పవళించు నాగశయనా
మోహిని విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనో మోహనా
మోహిని విలాస కలిత నవమోహన
మోహదూర మౌనిరాజ మనో మోహనా
మందహాస మధురవదన రమా నాయక
మందహాస మధురవదన రమా నాయక
కోటి చంద్ర కాంతిసదన శ్రీలోల
పాల మున్నీటా పవళించు నాగశయనా
చిన్నారి దేవేరి సేవలు చేయ
మున్నీట పవళించు నాగశయనా
రాముని అవతారం రవికుల సోముని అవతారం
ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో ఓ
రాముని అవతారం రవికుల సోముని అవతారం మ్మ్
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం
రాముని అవతారం
దాశరథిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యాసతి తఫము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శత్రుఘ్న భరతా
రాముని అవతారం రవికుల సోముని అవతారం
చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేత
విశ్వామితృని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపం
అంతము చేయునహల్యకు శాపం
ఒసగును సుందర రూపం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిథిలా నగరమున
రాముని అవతారం రవికుల సోముని అవతారం
కపట నాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలికా శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం మ్మ్ మ్మ్
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
భరతుని కోరిక తీరుచు కోసం
పాదుక లొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం
గురుజన సేవకు ఆదేశం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
అదిగో చూడుము బంగరు జింకా
అదిగో చూడుము బంగరు జింకా
మన్నై చనునయ్యో లంకా
హరనయనాగ్ని పరాంగనవంకా
అడిగిన మరణమె నీ జింకా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం
జీవన్ముక్తికి సోపానం
రామరామ జయ రామ రామ
జయ రామరామ రఘుకుల సోమా
సీతాశోక వినాశనకారి
లంకా వైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతిపై మమకారం
వెలయును ధర్మ విచారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి